అదనపు కట్నం కోసం పంచాయతీ సెక్రటరీ వేధింపులు

అదనపు కట్నం కోసం పంచాయతీ సెక్రటరీ వేధింపులు

పంచాయితీ సెక్రటరీ అయిన తన భర్త తనను అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడటంతో పాటు.. గృహహింసకు గురిచేస్తున్నాడంటూ ఓ మహిళ రాయికల్ ఎంపీడీవోకు ఫిర్యాదు చేసింది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల పంచాయితీ కార్యదర్శిగా పనిచేస్తున్న కొండూరి రాజేష్..సోమనపల్లికి చెందిన గుర్షకుర్తి రజినీని మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే పెళ్లయిన కొద్ది రోజుల నుంచే అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ రజినీ రాయికల్ ఎంపీడీవోకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. రాజేష్, రజనీలకు ఒక కుమారుడు. ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలోనూ దారుణంగా వ్యవహరించాడని.. ఆ టైంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. రాజేష్ పై చర్యలు తీసుకోవడంతో పాటు... అతనికి ప్రభుత్వం నుంచి వచ్చే జీతభత్యాలు, అలవెన్సులు అన్నింటినీ ఆపేయాలని ఎంపీడీవోను కోరినట్టు మహిళ తెలిపారు.