గుట్ట సీసీ ఫుటేజీలతో మహిళకు వేధింపులు

గుట్ట సీసీ ఫుటేజీలతో మహిళకు వేధింపులు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలి ఫొటోలు, వీడియోలు హైదరాబాద్​లోని ఒక కానిస్టేబుల్​కు చేరాయి. సీసీ టీవీల నుంచి తీసిన ఈ ఫుటేజీలను ఆలయంలోని ఎస్పీఎఫ్ సిబ్బంది ఒకరు పంపినట్టు తెలుస్తోంది. బాధితురాలి కంప్లయింట్​ప్రకారం..పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఓ మహిళ 2014లో హైదరాబాద్​కు చెందిన మహమ్మద్​అహ్మద్​అనే కానిస్టేబుల్​ను ప్రేమించి పెండ్లి చేసుకుంది. అయితే, ఆమెను వేధింపులకు గురి చేయడంతో దూరమై నాగోల్​లో ఉంటోంది. అతడు గోదావరిఖనికి ట్రాన్స్​ఫర్​అయ్యాక కూడా వేధించడం మానలేదు.

ALSO READ:కొంపముంచిన బ్యూటీపార్లర్‌ .. అయిల్‌ పెట్టగానే జుట్టు మొత్తం ఊడిపోయింది

ఈ క్రమంలో జూన్ 28న బాధితురాలు తన ఫ్రెండ్​తో కలిసి దర్శనం కోసం గుట్టకు వచ్చింది. విషయం తెలుసుకున్న మహమ్మద్​అహ్మద్​ టెంపుల్ లో పని చేసే తన ఫ్రెండ్​అయిన ఎస్పీఎఫ్​ కానిస్టేబుల్​కు విషయం చెప్పాడు. దీంతో అతడు ఆలయ ప్రాంగణంలో ఫ్రెండ్​తో ఉన్న సదరు మహిళ ఫొటోలు, వీడియోల సీసీ ఫుటేజీలను పంపించాడు. వీటిని అతడు అందరికీ పంపిస్తూ విడాకులు ఇవ్వాలని సతాయిస్తున్నాడు. దీంతో సదరు మహిళ బుధవారం గుట్టకు వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మరోవైపు వీహెచ్​పీ నేతలు కూడా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కంప్లయింట్​ఇచ్చారు.  దీనిపై ఇంతకుముందే గుట్ట ఈవోకు, రాచకొండ సీపీకి ఫిర్యాదు చేసింది.