పెద్ద మనసు చాటుకున్న పాండ్యా బ్రదర్స్‌‌

పెద్ద మనసు చాటుకున్న పాండ్యా బ్రదర్స్‌‌

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తున్న  వేళ క్రికెటర్లు తమకు తోచిన సాయం చేస్తూ  బాధితులకు అండగా నిలుస్తున్నారు. తాజాగా టీమిండియా, ముంబై ఇండియన్స్‌‌ ప్లేయర్లు హార్దిక్‌‌, క్రునాల్‌‌ పాండ్యా బ్రదర్స్‌‌ ముందుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా బాధితుల కోసం తమ ఫ్యామిలీ తరఫున 200 ఆక్సిజన్‌‌ కాన్సెన్‌‌ట్రేటర్స్‌‌ డొనేట్‌‌ చేశారు. చెన్నైతో మ్యాచ్‌‌కు ముందు హార్దిక్‌‌ ఈ విషయం చెప్పాడు. ‘కరోనాపై యుద్ధంలో ముందుండి పోరాడుతున్న మెడికల్‌‌ స్టాఫ్‌‌, ఇతర ఫ్రంట్‌‌లైన్‌‌ వర్కర్స్‌‌కు థ్యాంక్స్‌‌. ఈ టైమ్‌‌లో క్రునాల్‌‌, నేను, మా అమ్మ.. మొత్తంగా మా ఫ్యామిలీ తరఫున సాయం అందించే మార్గాలు అన్వేషించాం. ఈ టైమ్‌‌లో మెడికల్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ అవసరం ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాలకు 200 ఆక్సిజన్‌‌ కాన్సెన్‌‌ట్రేటర్స్‌‌ డొనేట్‌‌ చేయాలని డిసైడయ్యాం. ఈ కష్టకాలం నుంచి ప్రజలు బయటపడాలని  మా ప్లేయర్లంతా ప్రార్థిస్తున్నారు’ అని హార్దిక్‌‌ పేర్కొన్నాడు. మరోవైపు అజింక్యా రహానె సైతం మహారాష్ట్రలో 30 ఆక్సిజన్‌‌ కాన్సెన్‌‌ట్రేటర్స్‌‌ను సమకూర్చేందుకు ముందుకొచ్చాడు.