పాండ్యా హాఫ్ సెంచరీ.. సన్ రైజర్స్ టార్గెట్ 163

పాండ్యా హాఫ్ సెంచరీ.. సన్ రైజర్స్ టార్గెట్ 163

సన్ రైజర్స్ కు 163 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది గుజరాత్ టైటాన్స్. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఓపెనర్ల మాథ్యూ వాడే 19, శుభ్ మన్ గిల్ 7 పరుగులతో నిరాశ పరిచినా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా హాఫ్ సెంచరీతో.. అభినవ్ మనోహర్ 35 పరుగులతో రాణించడంతో గుజరాత్ టైటాన్స్ 162 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో  భువనేశ్వర్ కుమార్ 2, నటరాజన్ 2, జాన్సన్ , మాలిక్ లు చెరో వికెట్ తీశారు.