Cricket World Cup 2023: జట్టులో లేకపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నా : హార్దిక్ పాండ్య ఎమోషనల్

Cricket World Cup 2023: జట్టులో లేకపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నా : హార్దిక్ పాండ్య ఎమోషనల్

ప్రపంచ కప్ లో భారత క్రికెట్ జర్నీ విజయవంతంగా కొనసాగుతున్నా.. హార్దిక్ పాండ్య లేకపోవడం టీమిండియా శిభిరంలో ఆందోళన కలిగిస్తుంది. చీలమండ గాయంతో ఇంకా కోలుకొని హార్దిక్.. ఈ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. కొన్ని గంటల క్రితం బీసీసీఐ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. తాజాగా హార్దిక్ ఈ విషయంపై స్పందిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసాడు.
 
వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో గాయం కారణంగా దూరమవ్వడం ఏ ఆటగాడికైనా కష్టంగానే ఉంటుంది. హార్దిక్ కూడా భారత జట్టుకు దూరమవ్వడం తట్టుకోలేకపోయాడు. " గాయంతో ప్రపంచ కప్ కు దూరమవ్వడం చాలా బాధగా ఉంది. ఈ విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. ప్రస్తుతం ఉన్న టీంతో నాకు  చాలా ప్రత్యేక అనుబంధం ఉంది. ఇప్పటివరకు నాపై మీరు చూపించిన అభిమానానికి ధన్యవాదాలు". అని పాండ్య ట్వీట్ ఎమోషనల్ ట్వీట్ చేసాడు.   

Also Read :- మా అమ్మను కోల్పోయాను.. అయినా జట్టును సెమీస్‌కు చేరుస్తా

ఈ వరల్డ్ కప్ లో మొదటి మూడు మ్యాచ్ లు ఆడిన హార్దిక్.. బంగ్లాపై ఆడిన మ్యాచ్ లో బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు.అయితే చీలమండ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో  ఆ తర్వాత వరుసగా న్యూజీలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక మ్యాచ్ లకు దూరమయ్యాడు. బెంగళూరు NCA లో తీవ్రంగా శ్రమించినప్పటికీ హార్దిక్ కు మరింతగా విశ్రాంతి కావాలని వైద్య బృందం తెలిపింది. దీంతో హార్దిక్ లేకుండానే టీమిండియా తర్వాత వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడబోతుంది. అయితే పాండ్య స్థానంలో వచ్చిన షమీ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ప్రస్తుతం భారత్ అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది.          

ఇక హార్దిక్ దూరం కావడంతో ఆ స్థానంలో పేస్ బౌలర్ ప్రసిద్ కృష్ణను ఎంపిక చేసింది. ప్రస్తుతం టీమిండియా సెమీ ఫైనల్ కు చేరుకోగా లీగ్ లో దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ తో మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. మరి ఈ స్టార్ ఆల్ రౌండర్ లేని దూరమవ్వడం జట్టుపై ఎలాంటి  ప్రభావం చూపిస్తుందో చూడాలి.