పాండ్య గాయంపై కీలక అప్ డేట్.. టీ20 వరల్డ్ కప్ ఆడతాడా..?

పాండ్య గాయంపై కీలక అప్ డేట్.. టీ20 వరల్డ్ కప్ ఆడతాడా..?

వరల్డ్ కప్ లో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య గాయంతో దూరం కావడం భారత జట్టుపై ప్రభావం చూపింది. సెమీస్ వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గెలిచిన టీమిండియా ఫైనల్లో మాత్రం ఆరో బౌలర్ లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో భారత్ ఓడిపోగా.. ఈ మ్యాచ్ లో హార్దిక్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఇదే సమయంలో హార్దిక్ ఎప్పుడు కోలుకుంటాడు? 2024 లో జరిగే టీ 20 ప్రపంచ కప్ లో ఆడతాడా? అనే సందేహాలు ఫ్యాన్స్ లో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హార్దిక్ గాయం నుంచి ఒక కీలక అప్ డేట్ వచ్చింది. 

రిపోర్ట్స్ ప్రకారం పాండ్య  గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో జనవరి చివరి వరకు ఎలాంటి మ్యాచ్ లు ఆడడు. ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ ఉండడంతో పాండ్య ఐపీఎల్ 2024 కు రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ పూర్తిగా కోలుకోకుండా ఐపీఎల్ ఆడితే జూన్ నెలలో వెస్టిండీస్, అమెరికా వేదికగా టీ 20 వరల్డ్ కప్ కు ఈ స్టార్ ఆల్ రౌండర్ దూరమయ్యే ప్రమాదం ఉంది. ఐపీఎల్ ముగిసిన కొన్ని రోజులకే ఈ వరల్డ్ కప్ జరగనుంది. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలకు పాండ్య జట్టులో ఉండడం చాలా కీలకం. మరి పాండ్య పూర్తిగా కోలుకొని టీ 20 వరల్డ్ కప్ ఆడతాడో లేదో తెలియాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందే. 

వరల్డ్ కప్ 2023లో తొలి మూడు లీగ్ మ్యాచ్ లు ఆడిన పాండ్య.. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. చీలమండ గాయం కారణంగా బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో  శిక్షణ తీసుకున్నప్పటికే పాండ్య గాయం తగ్గకపోవడంతో వరల్డ్ కప్ మొత్తానికి దూరం అయ్యాడు. గత సంవత్సరం నుండి రోహిత్ గైర్హాజరీలో భారత టీ 20 జట్టుకు హార్దిక్ కెప్టెన్సీ చేస్తున్నాడు. 2024 వరల్డ్ కప్ కు పాండ్యను కెప్టెన్ గా చేసే అవకాశాలు లేకపోలేదు.