V6 News

Hardik Pandya: చీప్ సెన్సేషనలిజం.. గర్ల్ ఫ్రెండ్‌ను అసభ్యకర కోణంలో వీడియో తీసిన వారిపై హార్దిక్ పాండ్య ఫైర్

Hardik Pandya: చీప్ సెన్సేషనలిజం.. గర్ల్ ఫ్రెండ్‌ను అసభ్యకర కోణంలో వీడియో తీసిన వారిపై హార్దిక్ పాండ్య ఫైర్

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత మహికా శర్మతో ప్రేమాయణం నడుపుతున్నాడు. మహికా శర్మతో తాను ప్రేమలో ఉన్నట్లు పాండ్య ఇప్పటికే కన్ఫర్మ్ చేసి క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ డేటింగ్ లో తమ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో హార్దిక్ కు కోపం తెప్పించే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. మహికా శర్మను అభ్యంతరకర రీతిలో ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై ఈ టీమిండియా ఆల్ రౌండర్ ఫైరయ్యాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలు హార్దిక్ ను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. 

అసలేం జరిగిందంటే:
 
మహికా శర్మ ఒక రెస్టారెంట్ నుంచి వస్తుండగా.. కొందరు పపరాజీలు ఆమెను అసభ్యకరమైన కోణాల్లో వీడియోలు, ఫోటోలు తీసి నెట్టింట వైరల్ చేశారు. ఈ సంఘటన హార్దిక్ పాండ్యాకు కోపం తెప్పించింది. వెంటనే స్పందిస్తూ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంలో హద్దులు మీరినందుకు పాండ్య ఫోటోగ్రాఫర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందించిన హార్దిక్ పాండ్యా... "సెలబ్రిటీగా ఉండటం అనేది మా జీవితంలో భాగం. స్త్రీలను గౌరవించడం కనీస లక్షణం. ఈ విషయంలో అందరూ కొంచెం  మానవత్వం కలిగి ఉండాలి. ప్రతీదీ క్యాప్చర్ చేయాల్సిన అవసరం లేదు. అదే విధంగా ప్రతీ కోణాన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కేవలం హెడ్‌లైన్స్, క్లిక్‌ల కోసం 'చీప్ సెన్సేషనలిజమ్‌కు' దిగజారడం సరికాదు". అని పాండ్య సీరియస్ అయ్యాడు.

ALSO READ :  ఐపీఎల్ 2026 మినీ వేలం.. టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్, ఆటగాళ్ల కనీస ధర వివరాలు!

ప్రస్తుతం హార్దిక్ పాండ్య సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కు సిద్ధమవుతున్నాడు. 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా తొలి టీ20 మంగళవారం (డిసెంబర్ 9) జరగనుంది. కటక్ వేదికగా బారబత్ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ కు ఆతిధ్యమివ్వనుంది. ఆసియా కప్ తర్వాత హార్దిక్ ఆడుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఆసియా కప్ ఫైనల్ కు గాయం కారణంగా దూరమైన పాండ్య.. ఇటీవలే పూర్తి ఫిట్ నెస్ సాధించి టీమిండియాలో చోటు సంపాదించాడు. రీ ఎంట్రీలో ముస్తాక్ అలీ ట్రోఫీలో బరిలోకి దిగిన పాండ్య 42 బంతుల్లోనే 77 పరుగులు చేసి ఫామ్ లోకి వచ్చాడు. పాండ్య భారత జట్టులో చేరడంతో జట్టు సమతుల్యంగా కనిపిస్తుంది.