ధోని వల్లే ఆల్ రౌండర్గా నిలబడగలిగా..

ధోని వల్లే ఆల్ రౌండర్గా నిలబడగలిగా..

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని వల్లే తాను ఆల్ రౌండర్గా నిలబడగలిగానని..టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు. బ్యాటింగ్కు దిగినప్పుడు..వ్యక్తిగత స్కోరు కంటే..జట్టు స్కోరు ముఖ్యమని ధోని చెప్పినట్లు వివరించాడు. ధోని చెప్పిన ఈ మాట తనకు ఇంకా గుర్తుందన్నాడు. ఈ ఒక్క మాట తన బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో..ధోని చెప్పిన సలహా గుర్తుకు వస్తూనే ఉంటుందన్నాడు. ధోని చెప్పిన  ఈ సలహానే తనను ఆల్‌రౌండర్ నిలబెట్టిందని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. 

ధోని సలహా నన్ను మార్చింది...
స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆల్ రౌండర్  హార్దిక్ పాండ్యా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీతో తనకు ఉన్న అనుబంధాన్ని హార్దిక్ గుర్తు చేసుకున్నాడు. ఆల్‌రౌండర్‌గా ఎదిగేందుకు ధోనీ తనకు ఎలా సహకరించాడో  కూడా చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు..స్కోరు బోర్డును చూస్తూ ఆడాలని ధోని చెప్పాడని..జట్టు ఏ పరిస్థితుల్లో ఉందో అప్పుడు అర్థమవుతుందని చెప్పినట్లు పాండ్యా వివరించాడు. దానికి అనుగుణంగా బ్యాటింగ్ చేయాలని చెప్పాడన్నాడు. ఎప్పుడూ కూడా వ్యక్తిగత స్కోర్‌ను చూస్తూ ఆడితే ప్రయోజనం ఉండదని ధోనీ చెప్పాడని...జట్టు కోసమే ఆడితే..పరుగులు వాటంతటవే వస్తాయన్నట్లు ధోని సలహా ఇచ్చినట్లు పాండ్యా వెల్లడించాడు. 

క్రికెటే ముఖ్యం...
తన జీవితంలో క్రికెట్ ముఖ్యమని హార్దిక్ పాండ్యా తెలిపాడు. క్రికెట్ వల్లే ఏదైనా సాధ్యమవుతుందని నమ్మినట్లు చెప్పాడు. అందుకే క్రికెటర్ అయ్యేందుకు తీవ్రంగా కష్టపడినట్లు చెప్పుకొచ్చాడు. 

టీ20 వరల్డ్ కప్లో హార్దిక్ కీ ప్లేయర్..
ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా వ్యవహరించిన హార్దిక్..జట్టును విజేతగా నిలిపాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించి..తొలి టైటిల్ను అందుకున్నాడు. అదే ఫాంతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన పాండ్యా..అంచనాలకు తగ్గట్లు రాణిస్తున్నాడు. దీంతో టీ20 వరల్డ్ కప్లో టీమిండియాకు హార్దిక్ కీ ప్లేయర్గా మారతాడని మాజీ క్రికెటర్లు విశ్వసించారు. ఈ నేపథ్యంలో భారత్ టీ20 ప్రపంచకప్ గెలవాలంటే హార్దిక్ రాణించాలని చెబుతున్నారు.