హర్‌ ఘర్‌ తిరంగా ఉద్యమంలో ఐటీబీపీ జవాన్లు

హర్‌ ఘర్‌ తిరంగా ఉద్యమంలో ఐటీబీపీ జవాన్లు

స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అజాదీ కా అమృత్ మహోత్సవ్‌ పేరుతో కేంద్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాని మోడీ ఇటీవలే పిలుపునిచ్చారు. అంతే కాకుండా హర్‌ ఘర్‌ తిరంగా ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండో టిబెటన్ సరిహద్దులో ఉండే భారత జవాన్లు కూడా స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో పాల్గొన్నారు. 

భారత సాతంత్ర్య ఉత్సవాల్లో భాగంగా లఢక్ లో సుమారు 18,400 ఎత్తులో భారత జాతీయ త్రివర్ణ పతకాన్ని ఐటీబీపీ జవాన్లు ఎగురవేశారు. ఇదిలా ఉండగా బద్రినాథ్ లోనూ ఐటీబీపీ జవాన్లు హర్‌ ఘర్‌ తిరంగా క్యాంపెయిన్ చేపట్టారు. అక్కడి భక్తులు, స్థానికులతో కలిసి జాతీయ జెండా చేతబూని... నినాదాలు చేస్తూ, సంగీత వాయిద్యాల మధ్య ర్యాలీ నిర్వహించారు.