హరిహర వీరమల్లు మళ్ళీ వాయిదా..? కొత్త డేట్ ఇదేనా.. ?

హరిహర వీరమల్లు మళ్ళీ వాయిదా..? కొత్త డేట్ ఇదేనా.. ?

హరిహర వీరమల్లు సినిమా ఏ క్షణాన మొదలైందో కానీ... మొదటి నుంచి ఒకడుగు ముందుకేస్తే నాలుగు అడుగులు వెనక్కి అన్న చందాన సాగుతోంది. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ అయిపోవడం..  డైరెక్టర్ క్రిష్ తప్పుకోవడం దగ్గర నుంచి.. కథలో మార్పులు, షూటింగ్ జాప్యం ఇలా అష్టకష్టాలు దాటుకొని ఎట్టకేలకు షూటింగ్ కంప్లీట్ చేసుకొని జూన్ 12న విడుదలకు సిద్ధమైంది హరిహర వీరమల్లు సినిమా.  మొత్తానికి సినిమా రిలీజ్ అవుతోందని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునే లోపే.. మరో పిడుగులాంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హరిహర వీరమల్లు సినిమా మళ్ళీ వాయిదా పడిందని, జులై 4న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలీదు కానీ.. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మాత్రం హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి.

సీజీ వర్క్ డిలే అవ్వడమే సినిమా వాయిదాకి కారణమని టాక్ వినిపిస్తోంది. ఇటీవల డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఓ ఇంటర్వ్యూలో  హరిహర  వీరమల్లు సీజీ వర్క్ విషయంలో లోపాలు సరిదిద్దటానికి చాలా సమయం పట్టిందని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చుస్తే సినిమా మళ్ళీ వాయిదా అన్న వార్తల్లో నిజం లేకపోలేదు అనిపిస్తోంది. ఏది ఏమైనా హరిహర వీరమల్లు సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సహనానికి పరీక్ష పెడుతోందని చెప్పాలి. మరి, ఐదేళ్లుగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఎదురుచూపులకు జూన్ 12తో ఫుల్ స్టాప్ పడుతుందా లేదా సినిమా మళ్ళీ వాయిదా పడుతుందా అన్నది వేచి చూడాలి.

ఇదిలా ఉండగా... ఇప్పటికే విడుదలైన నాలుగు పాటలు మంచి రెస్పాన్స్ అందుకొని సినిమాపై అంచనాలు మరింత పెంచాయి.ఏఎం రత్నం నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించింది. కీరవాణి సంగీత దర్శకత్వం వహించగా.. మనోజ్ పరహంస, వీఎస్ జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందించారు.