
వరుస సినిమాలకు కమిటైనా.. పొలిటికల్ టూర్స్‌తో బిజీ కావడం వల్ల పవన్ కళ్యాణ్ షెడ్యూల్స్ బాగా టైట్ అయ్యాయి. అయినా కూడా చేతిలో ఉన్న చిత్రాల్ని పూర్తి చేసేందుకు పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నారు. ముందుగా క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ను కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. రీసెంట్‌గా వర్క్ షాప్స్ నిర్వహించిన టీమ్.. నేటి నుంచి కొత్త షెడ్యూల్‌ని మొదలు పెట్టబోతున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన స్పెషల్ సెట్‌లో పవన్‌పై కొన్ని యాక్షన్ సీన్స్‌ని చిత్రీకరించనున్నారు. ఈ మూవీ కోసం పవన్ నలభై రోజుల కాల్‌షీట్స్ కేటాయించారని, ఆ గడువు ముగిసేలోగా మొత్తం షూట్ కంప్లీట్ చేయడమే టార్గెట్‌గా టీమ్ పని చేస్తోందని సమాచారం.
ఈ భారీ పీరియాడికల్ డ్రామాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్. బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ కీలక పాత్ర పోషిస్తోంది. వచ్చే వేసవికి రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు నిర్మాత ఎ.ఎం.రత్నం. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమాలో పవన్ నటించాల్సి ఉంది. అలాగే సురేందర్ రెడ్డితోనూ ఓ మూవీ చేయనున్నారు. పరశురామ్ కూడా పవన్ కోసం స్టోరీ రెడీ చేసినట్టు తెలుస్తోంది. వీటితో పాటు తమిళ హిట్ ‘వినోదాయ సిత్తం’ రీమేక్‌కి కూడా పవన్ కమిటయ్యారు. సముద్రఖని దర్శకత్వం వహించనున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది.