పనాజీ: ఇండియా గ్రాండ్‌మాస్టర్ పి. హరికృష్ణ ఫిడే వరల్డ్ కప్‌లో ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టాడు. మెక్సికో జీఎం జోస్ మార్టినెజ్‌తో క్లాసికల్ ఫార్మాట్‌లో రెండు గేమ్స్ డ్రా అయిన తర్వాత ఆదివారం 15 నిమిషాల టైమ్- కంట్రోల్‌తో జరిగిన తొలి రెండు టై -బ్రేక్స్‌లోనూ హరి పాయింట్లు పంచుకున్నాడు.
ఆపై 10 నిమిషాల టైమ్ -కంట్రోల్‌తో నిర్వహించిన మూడో టై -బ్రేక్‌లో హరికృష్ణ 59 ఎత్తుల్లో ఓడిపోయాడు. కచ్చితంగా నెగ్గాల్సిన తర్వాతి గేమ్‌లో నల్ల పావులతో ఆడిన హరి 30 ఎత్తుల తర్వాత డ్రాకు అంగీకరించాడు. దాంతో మార్టినెజ్ ఓవరాల్‌గా 3.5--–2.5 తేడాతో విజయం సాధించి ముందంజ వేయగా.. హరి ఇంటిదారి పట్టాడు.
సోమవారం ప్రారంభమయ్యే క్వార్టర్స్‌లో ఇండియా నుంచి ఎరిగైసి అర్జున్ మాత్రమే మిగిలాడు.
