
ఆసియా కప్ ప్రారంభానికి ముందే భారత్, పాకిస్థాన్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇండియాను చిత్తుగా ఓడిస్తామంటూ పాక్ ఆటగాళ్లు, మాజీలు ప్రగల్భాలు పలుకుతున్నారు. తాజాగా పాక్ సీనియర్ బౌలర్ హారిస్ రవూఫ్ కూడా ఇవే తరహా వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్‌లో భారత్‌తో జరిగే రెండు మ్యాచులు మేమే గెలుస్తామని బీరాలు పలికాడు. ఆసియా కప్‌లో భారత్, పాక్ మ్యాచ్ గురించి ఓ అభిమాని అడిగిన ప్రశ్నలకు రవూఫ్ బదులిస్తూ.. ‘ఇండియాతో జరిగే రెండు మ్యాచ్‌లు మేమే గెలుస్తాం.. దేవుడి ఆశీర్వాదం మాపై ఉంది’ అన్నాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. హారిస్ రవూఫ్ అతివిశ్వాసంపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ‘‘మీరు గెలిచేది లేదు.. సచ్చేది లేదు.. అన్ని ఉద్దేర మాటలే’’ అంటూ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ రవూఫ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. పాకిస్థాన్ ఆసియా కప్ జట్టులో హారిస్ రవూఫ్ ఎంపికైన విషయం తెలిసిందే.
2025, సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు దుబాయ్, అబుదాబి వేదికగా ఆసియా కప్-2025 జరగనుంది. ఈ సారి టీ20 ఫార్మాట్లో జరగనున్న ఈ కాంటినెంటల్ టోర్నీలో పాకిస్తాన్, ఇండియా, ఒమన్, యూఏఈ జట్లు గ్రూప్ ఏలో తలపడనున్నాయి. సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్ తలపడనున్నాయి. సమీకరణలన్నీ అనుకున్నట్లుగా జరిగితే సూపర్4 స్టేజ్‌లో ఒకసారి, ఫైనల్ పోరులో మరోసారి ఇండియా, పాకిస్థాన్ జట్లు తలపడే అవకాశం ఉంది.
క్రికెట్లో ఇండియా, పాక్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ వేరే. దాయాదుల పోరు కోసం ఇరుదేశాల క్రికెట్ ఫ్యాన్సే కాకుండా యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రియులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు. అయితే, ఆసియా కప్‌లో భారత్ పాక్ ఆడనున్న మ్యాచ్‌లపై సంధిగ్ధం నెలకొంది. ఇటీవల భారత్ పాకిస్థాన్ మధ్య చోటు చేసుకున్న సైనిక ఘర్షణల వల్ల పాక్ మ్యాచ్‌ను భారత్ ఈ మ్యాచును బైకాట్ చేసే అవకాశం ఉన్నట్లు క్రీడా వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే మాత్రం క్రికెట్ ప్రియులకు తీవ్ర నిరాశ అనే చెప్పవచ్చు.
ALSO READ : ధోనీ కాదు.. ఇండియాలో అతడే నెంబర్ వన్ వికెట్ కీపర్
ఆసియా కప్ 2025 పాకిస్తాన్ జట్టు: సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్ , ఫఖర్ జమాన్ , హరీస్ రవూఫ్, హసన్ అలీ , హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, ఖుష్దిల్ షా, మహ్మద్ వపెర్జ్, మొహమ్మద్ వాపెర్జ్ (వికెట్, మొహమ్మద్ వాపెర్జ్), సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ షా ఆఫ్రిది, సుఫ్యాన్ మోకిమ్.