R Sridhar: ధోనీ కాదు.. ఇండియాలో అతడే నెంబర్ వన్ వికెట్ కీపర్: టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్

R Sridhar: ధోనీ కాదు.. ఇండియాలో అతడే నెంబర్ వన్ వికెట్ కీపర్: టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్

ఇండియా క్రికెట్ చరిత్రలో బెస్ట్ వికెట్-కీపర్ అంటే ఎవరికైనా ఠక్కున మహేంద్ర సింగ్ ధోనీ చెప్పేస్తారు. రెండు దశాబ్దాలుగా వికెట్ కీపింగ్ పై ధోనీ వేసిన ముద్ర అలాంటిది. స్టంప్స్ వెనకాల కూల్ గా ఉంటూ ప్రత్యర్థులకు తన కీపింగ్ నైపుణ్యాలతో చెమటలు పట్టిస్తాడు. మహేంద్రుడు వికెట్ల వెనకాల ఉంటే క్రీజ్ ధాటి రావడానికి కూడా బ్యాటర్లు సందేహిస్తారు. ముఖ్యంగా స్టంపింగ్ లో ధోనీకి తిరుగులేదు. ఇప్పటివరకు ఎన్నో మెరుపు స్టంపింగ్ లతో క్రేజీ స్టంపింగ్స్ చేశాడు. అయితే టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ మాత్రం ధోనీని పొగుడుతూనే టీమిండియా బెస్ట్ వికెట్ కీపర్ గా మరొకరిని ఎంచుకున్నాడు. 

ఆర్. శ్రీధర్ ఎంఎస్ ధోని కంటే వృద్ధిమాన్ సాహా బెటర్ వికెట్ కీపర్ అని తన అభిప్రాయాన్ని తెలిపాడు. సాహా నైపుణ్యాలను ప్రశంసిస్తూ  శ్రీధర్ ఇలా మాట్లాడాడు. "సాహా అద్భుతమైన వికెట్ కీపర్. వికెట్ కీపింగ్ చేసేటప్పుడు తన పట్టుదలను చూపిస్తాడు. గ్లోవ్స్ వేసుకుంటే తన ఆటిట్యూడ్ ఇంకోలా ఉంటుంది. జట్టు కోసం ఊహించని స్కిల్స్ తనలో బయటపెడతాడు. ఎక్కువగా మాట్లాడకపోయినా సాహా వికెట్ల వెనకాల ఉంటూ కెప్టెన్ కు కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉంటాడు. ఎంఎస్ ధోని కంప్లీట్ ప్యాకేజీ. అతను అన్ని విభాగాల్లో కలిపి నెంబర్ వన్. కానీ వికెట్ కీపర్ విషయంలో మాత్రం వృద్ధిమాన్ సాహా అగ్రస్థానంలో ఉన్నాడు". అని శ్రీధర్ తెలిపాడు. 

ALSO READ : 7000 పరుగులు, 500 వికెట్లు..

2010లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సాహా భారత జట్టు తరఫున 40 టెస్టులు, 9 వన్డేలు ఆడాడు. 11 ఏళ్ల సాహా టెస్ట్ కెరీర్‌లో 92 క్యాచ్‌లు, 12 స్టంపింగ్‌లు ఉన్నాయి. 2014లో ఎంఎస్ ధోని టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాక.. రిషబ్ పంత్ రాకముందే భారత టెస్ట్ జట్టుకు సాహానే దిక్కు. బ్యాటింగ్ కంటె కూడా ఎక్కువగా తన కీపింగ్ స్కిల్స్ తో ఆకట్టుకునేవాడు. ఎన్నో స్టన్నింగ్ క్యాచ్ లు, మెరుపు స్టంపింగ్స్ చేసి మ్యాచ్ లను మలుపు తిప్పిన రోజులు కూడా ఉన్నాయి. ఎన్నో విలువైన ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ, తగిన గుర్తింపు పొందలేకపోయాడు. 2021లో సాహా తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.