ఒక్క ఓట‌మితో టీఆర్ఎస్ కుంగిపోదు

ఒక్క  ఓట‌మితో టీఆర్ఎస్ కుంగిపోదు

హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఓటమిపై స్పందించారు మంత్రి హరీశ్ రావు.ప్రజా తీర్పును శిర‌సావ‌హిస్తామన్నారు. ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిన ఓట‌ర్లంద‌రికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ  ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.  ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎన్నికలో ఓట‌మితో కుంగిపోదని.. గెలిచిన‌ నాడు పొంగిపోలేదన్నారు. ఓడినా.. గెలిచినా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ప‌క్షాన ఉండి ప‌నిచేస్తుందన్నారు హరీశ్. హుజురాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై  టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ 24 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.