సిద్దిపేట, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు కార్యకర్తలకు సూచించారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు, సమన్వయకర్తలతో సభ్యత్వ నమోదుపై సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ నియోజకవర్గాల వారీగా నియమితులైన సమన్వయకర్తలు స్థానిక నాయకత్వంతో మమేకమై, ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు.
సమావేశంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్ రావు, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, శశిధర్ రెడ్డి, మాజీ చైర్మన్లు ఒంటేరు ప్రతాపరెడ్డి, దేవి ప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, సమన్వయకర్తలు, మెదక్ జిల్లా మెంబర్షిప్ ఇన్‌చార్జి బాలమల్లు పాల్గొన్నారు.
