
రుణమాఫీఫై మాజీమంత్రి హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రుణమాఫీ పూర్తిగా అయ్యిందని నిరూపిస్తే రాష్ట్రంలో ఎక్కడికైనా చర్చకు సిద్దమన్నారు. ప్లేస్, టైం చెబితే అక్కడ రుణమాఫీ అయ్యిందో లేదో తేల్చుదామన్నారు. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కొండంగల్ లో ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని రేవంత్ సవాల్ చేయాలేదా అని ప్రశ్నించారు.
100 శాతం రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు హరీశ్‌రావు. మొదట 40 వేల కోట్లన్నారు.. ఆ తర్వాత రూ.31 వేల కోట్లు ఉందని చెప్పి రూ.17 వేల కోట్లు మాఫీ చేశారు.. అంటే 54 శాతం రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు. ఏ రకంగా రుణమాఫీ చేశామని రేవంత్ చెప్పుకుంటున్నారని ప్రశ్నించారు.
27 లక్షల మంది రైతులకు రూ.17 వేల కోట్లతో రుణమాఫీ చేశారని హరీశ్ అన్నారు. తాము లక్ష రుణమాఫీ చేస్తేనే 36 లక్షల మంది రైతులు ఉన్నప్పుడు..రెండు లక్షల రుణమాఫీ చేస్తే 47 లక్షల మంది అయినా ఉండాలి కదా అని ప్రశ్నించారు.