
హైదరాబాద్ లో నదుల పరిరక్షణపై జాతీయ స్థాయి సదస్సు జరుగుతోంది. ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లో నిర్వహిస్తున్న జాతీయ సదస్సుకు సిక్కిం, అరుణాచల్ మినహా అన్ని రాష్ట్రాల ప్రతినిదులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ హైదరాబాద్ లో నదుల పై నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ నదులకు నడక నేర్పారన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మించుకున్నామన్నారు. చెరువులను బాగు చేయాలనే గొప్ప ఉద్దేశ్యం తోనే కేసీఆర్ మిషన్ కాకతీయ తీసుకు వచ్చారన్నారు హరీశ్ రావు. ప్రజల భాగస్వామ్యం తోనే మిషన్ కాకతీయ సక్సెస్ సాధ్యం అయిందన్నారు. ఈ పథకం ఇంజనీర్ల కోసమో, కాంట్రాక్టర్ల కోసమో కాదు... రైతుల కోసం...ప్రజల కోసమన్నారు. ఏ నినాదం కోసం అయితే ఉద్యమం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ నినాదానికి కేసీఆర్ కట్టుబడి ఉన్నాడన్నారు.
ఉద్యమ స్ఫూర్తితో మిషన్ కాకతీయ మన ఊరు మన చెరువు అద్భుత ఫలితాలు సాధించుకున్నామన్నారు. ప్రతీ నీటి చుక్కను ఒడిసి పట్టి, గ్రౌండ్ లెవల్ వాటర్ పెంచామన్నారు మంత్రి. ఒకప్పుడు చెరువు కట్టలు తెగి, వాగులు పొంగి, రోడ్లు తెగి ప్రజలు చనిపోయేవారన్నారు.ఇపుడు అలా జరగట్లేదు, ఎక్కడి నీళ్లు అక్కడే ఆగుతున్నాయన్నారు. పడ్డ ప్రతీ వర్షపు చుక్క చెరువు లోనే ఉండాలని తవ్వకాలు చేపట్టినమన్నారు హరీశ్ రావు. అడవుల్లో పశువులు నీళ్లు తాగడానికి చెక్ డ్యామ్ లు నిర్మించామన్నారు
గోదావరి నది మీద 5 బారేజ్ లు కట్టుకున్నామన్నారు. గోదావరి నది జీవ నదిగా మారింది.. ఎండిపోయే ప్రసక్తే లేదన్నారు. దమ్మున్న నాయకుడు ఉంటే ఏది కూడా అసాధ్యం కాదని కేసీఆర్ నిరూపించారన్నారు. 141 టీఎంసీ ల రిజర్వాయార్లను కూడా నిర్మించుకున్నామన్నారు. నీటి పారుదల వ్యవస్థ లేపోతే జీవ మనుగడ లేదన్నారు. ముందుచూపుతో అందరం నడుం కట్టాలన్నారు. వాటర్ మాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ స్పూర్తితోనే కేసీఆర్ ముందుకు వెళ్తున్నారన్నారు మంత్రి హరీశ్ రావు. తెలంగాణలో వ్యవసాయం పెరిగింది, పరిశ్రమలు పెరిగాయి, తలసారి ఆదాయం కూడా పెరిగిందన్నారు.
ఇవి కూడా చదవండి:
నాలుగు నెలల్లో కరోనా ఫోర్త్ వేవ్ :ఐఐటీ కాన్పూర్
ఏపీ సర్కార్‌పై ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు