ప్రాజెక్టులు అప్పగించేది లేదని ప్రభుత్వం రంకెలేస్తోంది : హరీష్ రావు

ప్రాజెక్టులు అప్పగించేది లేదని ప్రభుత్వం రంకెలేస్తోంది  :   హరీష్ రావు

కృష్ణా ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు  స్పందించారు.  సీఎం రేవంత్ నీచమైన పద్దతిలో కేసీఆర్ పై వ్యక్తిగత దూషణలు చేశారని మండిపడ్డారు.  రేవంత్ భాష, ధోరణి చూసి ప్రజలు అసహ్యంచుకుంటున్నారని  విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశంలో వితండవాదం తప్ప మరేమి లేదన్నారు.  తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఢిల్లీలో కేఆర్ఎంబీ సమావేశం జరిగిందని.. నెల రోజుల్లోపు 15 అవుట్‌లెట్స్‌ను కేఆర్‌ఎంబీకి అప్పగిస్తామని మినిట్స్‌లో చెప్పారని  హరీష్ రావు అన్నారు.  ప్రాజెక్టులు అప్పగించింది నిజం కాకుంటే ఎందుకు ఖండించలేదని హరీష్ ప్రశ్నించారు.  . ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులు అప్పగించేది లేదంటూ రంకెలేస్తోందన్నారు.   అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాలను నడపడం సరికాదన్నారు.  

కేసీఆర్ పదేళ్ల పాలనలో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించలేదన్న హరీష్..  అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే రేవంత్ సర్కార్ ప్రాజెక్టులను  అప్పగించదన్నారు.  ఢిల్లీకి ప్రాజెక్టులు అప్పగించి తెలంగాణను అడుక్కునే స్థాయికి తీసుకువచ్చారని విమర్శలు చేశారు.  చేసిన తప్పును కప్పి్పుచ్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  తమకు రాజకీయాలు ముఖ్యం కాదన్న హరీష్ రావు..   రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమన్నారు. తెలంగాణ  ప్రయోజనాలకు నష్టం కలిగించేలా వ్యవహరించవద్దని సూచించారు.