పూటకో బదిలీతో పాలన అస్తవ్యస్తం : హరీశ్ రావు

పూటకో బదిలీతో పాలన అస్తవ్యస్తం : హరీశ్ రావు
  •     హామీలు అటకెక్కాయి, ప్రతిక్షాలపై కేసులు పెరిగాయి: హరీశ్ రావు ఫైర్

హైదరాబాద్, వెలుగు: పూటకోసారి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను మారుస్తూ పాలనను సీఎం రేవంత్ రెడ్డి హాస్యాస్పదం చేశారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు  మండిపడ్డారు.140 మంది ఐఏఎస్‌‌లు, 20 మంది కలెక్టర్ల బదిలీలతో వ్యవస్థ గాడి తప్పిందని, కీలక శాఖల్లో అవి నీతి పెరిగిందని ఆరోపించారు. ప్రభుత్వం జారీ చేసిన 19,064 జీవోల్లో కేవలం 17 శాతం (3,290) మాత్రమే ఆన్‌‌లైన్‌‌లో ఉం చి, మిగిలిన 82 శాతం దాచడమేంటని ప్రశ్నించారు. 

గురువారం ఆయన అసెంబ్లీ బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో మాట్లాడారు. పోలీస్ నిధుల్లో రూ.400 కోట్లు కోత విధించడం దారుణమని, బకాయిలు ఇవ్వకపోవడం వల్ల రిటైర్డ్ పోలీసులు ఆత్మహత్య లు చేసుకుంటున్నార హరీశ్ అన్నారు. విపక్షాల గొంతు నొక్కుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.