గోదావరిఖనిలో హరీశ్‌‌రావు దిష్టిబొమ్మ దహనం

గోదావరిఖనిలో హరీశ్‌‌రావు దిష్టిబొమ్మ దహనం

గోదావరిఖని, వెలుగు: రామగుండం పవర్ ప్రాజెక్టులపై మాజీ మంత్రి హరీశ్‌‌రావు వ్యాఖ్యలకు నిరసనగా గోదావరిఖనిలోని మెయిన్‌‌చౌరస్తాలో ఆయన దిష్టిబొమ్మను గురువారం దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​ లీడర్లు మహంకాళి స్వామి, కోదండ రామాలయ చైర్మన్‌‌ గట్ల రమేశ్‌‌ మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌‌‌‌ఎస్‌‌ పాలనలో రామగుండం ప్రాంతానికి ఒక్క ప్రాజెక్ట్​ కూడా తీసుకురాలేదని విమర్శించారు.

 కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో రామగుండంలో 800 మెగావాట్ల పవర్​ ప్రాజెక్ట్​ తీసుకువస్తే కమీషన్ల కోసమేనంటూ హరీశ్‌‌రావు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో లీడర్లు బొంతల రాజేశ్‌‌, దీటి బాలరాజు, ఎల్లయ్య, ముస్తఫా, శ్రీను, వేణు, బాలరాజ్ కుమార్, శ్రీనివాస్, బుచ్చిరెడ్డి, రాజేశ్‌‌, తిప్పారపు శ్రీనివాస్, పాల్గొన్నారు. * హరీశ్‌‌రావును దూషిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేయడాన్ని ఖండిస్తూ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ గురువారం వన్​టౌన్​ పోలీస్​స్టేషన్‌‌లో కాంగ్రెస్​ లీడర్లపై ఫిర్యాదు చేశారు.