సీఎం రేవంత్ కి సిద్దిపేటపై ఇంత పగెందుకు : హరీష్ రావు

సీఎం రేవంత్ కి సిద్దిపేటపై ఇంత పగెందుకు :  హరీష్ రావు

సిద్దిపేటలో అభివృద్ధిని సీఎం రేవంత్ అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు.  సీఎం వెటర్నరీ కాలేజీని కొండంగల్ కి తరలించారన్నారు.  శిల్పారామం, డబుల్ రోడ్డు పనులను మధ్యలోనే అడ్డుకొని నిధులను కొడంగల్ కు తరలిస్తున్నారని చెప్పారు.  కొడంగల్ కు ఏమైనా తీసుకుపో తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్న హరీష్ ..  సిద్దిపేటకు వచ్చినవి తీసుకపోతే మాత్రం చూస్తూ ఉరుకొమన్నారు.  రేపు సిద్దిపేట ప్రజలు  కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ గల్లంతు చేస్తారని జోస్యం చెప్పారు.  సీఎం రేవంత్ కి సిద్దిపేటపై ఇంత పగ,కక్ష్య ఎందుకని హరీష్ ప్రశ్నించారు.  

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరెస్ట్ పై  హరీష్ రావు స్పందించారు.  కేంద్రంలోని బీజేపీ పార్టీ ప్రతిపక్ష నేతలపై కుట్రలతో కేసులు పెట్టి బలహీన పెట్టాలని చూస్తోందని ఆరోపించారు.  దేశంలో ఏ ఒక్క బీజేపీ నేత పైన అయిన కేసు నమోదు అయిందా అని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రతిపక్షాలను వేధిస్తూ కేసులు పెడుతూ రాజకీయంగా ఎదగాలని బీజేపీ చూస్తుందని విమర్శించారు.