నైతిక విలువలుంటే కడియం రాజీనామా చేయాలే : హరీష్ రావు

నైతిక విలువలుంటే కడియం రాజీనామా చేయాలే : హరీష్ రావు

కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నైతిక విలువలు ఉంటే పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిని విమర్శించి ఆయనతోనే జట్టు కట్టారని దుయ్యబట్టారు. రాజకీయాల్లో ఇంత దిగజారుడుతనం అవసరమా అని హరీష్ రావుప్రశ్నించారు. బీఆర్ఎస్‌కు కడియం ద్రోహం చేశారని మండిపడ్డారు. పార్టీని వదిలి వెళ్ళిన వాళ్లను తిరిగి తీసుకునేది లేదన్నారు.  కేసీఆర్ నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని హరీష్ ధీమా వ్యక్తం చేశారు. 

కడియం వెళ్లిన తరువాత పార్టీ లో జోష్ కనిపిస్తోందన్నారు హరీష్ రావు.  పార్టీకి ద్రోహం చేసిన కడియం ను ఓడగొట్టాలన్న కసి కనపడుతోందన్నారు.   టికెట్ ఇచ్చినాక కూడా ద్రోహం చేసిన వాళ్లకు గుణపాఠం చెప్పాలన్నారు.  కడియం శ్రీహరికి పార్టీ ఏం తక్కువ చేసిందని హరీష్  ప్రశ్నించారు.  ఆయన జీవితాంతం పార్టీకి రుణపడి ఉండాలన్నారు. పార్టీ మారేదీ లేదని ఎన్నోసార్లు చెప్పిన కడియం.. ఇప్పుడు ఎందుకు మారారో చెప్పాలని హరీష్ డిమాండ్ చేశారు. 

ALSO READ :- Women Beauty : పాదాలను పట్టించుకోండి.. అందంగా ఇలా మార్చుకోండి..

ప్రతిపక్ష పార్టీలు, నేతలపై సీబీఐ, ఈడీ దాడులు తప్ప బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు హరీష్ రావు.   బీజేపీ మాట వింటే జోడీ.. లేదంటే ఈడీ అని అన్నారు.  దేశంలో నల్ల చట్టాలు తెచ్చి మోదీ రైతుల ఉసురు తీశారన్నారు.  రూపాయి విలువ పడిపోయిందని..  పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని మండిపడ్డారు.  కేసీఆర్ యాదాద్రి గుడిని అద్భుతంగా కట్టిండని.. కానీ దేవుణ్ని ఏ రోజు కూడా రాజకీయంంగా వాడుకోలేదన్నారు. కానీ అయెధ్య రామాలయం కట్టి  మతం పేరున బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ మెడలు వంచాలంటే బీఆర్ ఎస్ కు ఓటేయాలన్నారు.