కరీంనగర్ సిటీ,వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులను విమర్శించే హక్కు మాజీ మంత్రి హరీశ్‌రావుకు లేదని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మండిపడ్డారు. కరీంనగర్ ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌజ్‌లో మీడియాతో మాట్లాడుతూ స్కామ్‌లపై హరీశ్‌రావు మాట్లాడడం చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని విమర్శించారు. స్కామ్‌ల అలవాటున్న హరీశ్‌రావుకు అందరు అలాగే కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. పదేండ్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు పెంచలేదని గుర్తుచేశారు.
కష్టపడి పైకొచ్చిన మంత్రులు పొన్నం ప్రభాకర్,అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజహరుద్దీన్ శాఖల టెండర్లలో స్కామ్ జరిగిందని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. నిజాయతీకి నిలువుటద్దంగా ఉన్న మంత్రి శ్రీధర్ బాబుపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సమావేశంలో కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, లీడర్లు ఆకారపు భాస్కర్‌రెడ్డి, మడుపు మోహన్, అంజనీ ప్రసాద్, నర్సింగం, రాంరెడ్డి, రవీందర్, నరేశ్, షెహన్షా, ఎల్లారెడ్డి, హనీఫ్ పాల్గొన్నారు.
