- మాజీ మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట, వెలుగు: విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి చదివితే జీవితంలో ఉన్నతస్థాయికి చేరుతారని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. శనివారం సిద్దిపేట కొండ భూదేవి గార్డెన్ లో తెలంగాణ ప్రైవేటు సూల్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనాని ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
కార్పొరేట్ స్కూళ్లు మార్కులు, ర్యాంకుల చుట్టూ తిరుగుతుంటే, ప్రైవేటు స్కూళ్లు మాత్రం విద్యార్థులకు జీవిత పాఠాలతో పాటు శారీర దారుడ్యంతో చదువులు చెబుతున్నాయన్నారు. విద్యార్థులు పుస్తక పఠనాన్ని జీవితంలో ఒక భాగం చేసుకోవాలని, పుస్తకాలు చదవితే జీవితంలో చెడిపోరని, అదే సెల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తే ఎందుకు పనికి రాకుండా పోతారని పేర్కొన్నారు.
ప్రైవేటు స్కూల్ టీచర్ల కష్టాలు తెలుసని, తక్కువ వేతనాలతోనే పనిచేస్తూ తమ విద్యుక్త ధర్మాన్ని పాటిస్తున్నారన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ టీపీఎస్ఎ జిల్లా అధ్యక్షుడు భగవాన్ రెడ్డి, సంపత్, రమేశ్ తో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
