హరీష్ రావు మస్తు లెక్కలు చెప్తున్నడు

హరీష్ రావు మస్తు లెక్కలు చెప్తున్నడు

ఆర్థిక మంత్రి హరీష్ రావు మస్తు లెక్కలు చెప్తున్నడ‌న్నారు బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు. మంత్రి హరీష్ రావు , కేసీఆర్ చదువుకున్నంతగా నేను పెద్ద పెద్ద చదువులు, వేల కొద్దీ పుస్తకాలు చదువుకోలేదన్నారు. కానీ కొన్ని ప్రశ్నలు వేస్తే వారు సమాధానం చెప్పాలన్నారు. నెలలో 1వ‌ తారీకున ఉద్యోగులకు ఇచ్చే జీతాలు వారం, పది రోజుల తర్వాత ఎందుకు ఇస్తున్నారో ఆర్థిక మంత్రి హరీష్ రావు చెప్పాలన్నారు. KGBV, మోడల్ స్కూల్ టీచర్ల జీతాలు ఎందుకు ఇస్తలేవో హరీష్ సమాధానం చెప్పాలన్నారు. ఈ రాష్ట్రంలో సర్పంచ్ లు సెక్యూరిటీ గార్డ్ లుగా, కూలీలుగా, బతకనీకి వేరే రాష్ట్రాలకూ ఎందుకు వెళ్తున్నారో హరీశ్ రావు సమాధానం చెప్పాలని ప్ర‌శ్నించారు. హరీష్ రావు చెప్పినట్టు రాష్ట్రం అభివృద్ది జరిగితే ప్రజా ప్రతినిధులు ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నారో కూడా చెప్పాలన్నారు. ఉద్యోగులకు PRC అన్నారు..ఏమైందన్నారు.

ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమైనవని.. ఎందుకు అమలు కాలేదని ప్ర‌శ్నించారు. హరీష్ రావు అసత్యాలను ప్రచారం చేస్తాడని..గ్లోబల్ ప్రచారం చేస్తాడన్నారు. కేంద్రం రైతులకు మీటర్లు పెట్టబోతున్నదని దుబ్బాకలో అసత్యాలు ప్రచారం చేసి... రైతులకు అబద్ధాలు చెప్పిండన్నారు. ఆర్థిక క్రమక్షణ లోపించిందనీ కాగ్ చెప్పిందన్నారు. అసెంబ్లీ ఆమోదం లేకుండానే డబ్బు ఖర్చు చేస్తున్నారనీ కాగ్ తిట్టిందన్నారు. తలసరి ఆదాయం చెప్పిన హరీష్ రావు రాష్ట్రానికి అప్పు ఎంత ఉందో ఎందుకు చెప్పలేదని ప్ర‌శ్నించారు. TRS ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి బాగా ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీనీ  ఎందుకు అమలు చేస్తలేదని ప్ర‌శ్నించారు ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్.