కేంద్రంలో TRS కీలకం కాబోతుంది : హరీష్

కేంద్రంలో TRS కీలకం కాబోతుంది : హరీష్

మెదక్ : కేంద్రంలో టీఆర్‌ఎస్ పార్టీ కీలకం కాబోతుందన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. శుక్రవారం కొత్త ప్రభాకర్‌ రెడ్డి మెదక్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేసిన సందర్భంగా హరీష్ మాట్లాడారు. “గజ్వేల్‌ కు త్వరలో రైలు రాబోతుంది. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కొత్త ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తాం:” అన్నారు. మెదక్ ఎంపీగా కొత్త ప్రభాకర్‌ రెడ్డికి అవకాశం ఇచ్చినందుక సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు హరీష్. ఆనవాయితీ ప్రకారం కోనాయిపల్లి దేవాలయంలో కొత్త ప్రభాకర్‌ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ కోనాయిపల్లి వేంకటేశ్వరుని ఆశీస్సులతో అన్ని పనుల్లో విజయం సాధించారు. వేంకటేశ్వరుని దయతో కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తారు అని చెప్పారు. తెలంగాణకు టీఆర్‌ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అని తెలిపారు హరీష్.