వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి పూర్తి రుణ మాఫీ

వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి పూర్తి రుణ మాఫీ

వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో రుణ మాఫీ చేస్తామన్నారు మంత్రి హరీశ్ రావు. కరోనా వల్ల రుణమాఫీ కొద్దిగా ఆలస్యమైందన్నారు. మెదక్ జిల్లా శంకరపట్నంలో ఏర్పాటు చేసిన రైతు వేదికను ఆయన ప్రారంభించారు. రైతుల కోసం ప్రభుత్వం మూడో వంతు బడ్జెట్ ఖర్చు చేస్తోందని చెప్పారు. రైతులు ధాన్యం ఆరబోసుకోడానికి… కళ్లాల నిర్మాణానికి డబ్బులు అందిస్తామన్నారు మంత్రి హరీశ్ రావు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు కమిటీలు ఉన్నాయి కానీ..రైతులకు ఏ కమిటీలు లేవన్నారు. మెదక్ జిల్లాలో రూ.94కోట్లతో 1888 మంది రైతులకు బీమా సాయం అందించామన్నారు.

‘మూడు కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు ఉరితాళ్ళు‘