
- బీజేపీ ఎంపీలపై మాజీ మంత్రి హరీశ్రావు ఫైర్
జోగిపేట, వెలుగు: బీజేపీ అంటేనే తెలంగాణను మోసం చేసిన పార్టీ అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సోమవారం మాజీ ఎమ్యెల్యే క్రాంతి కిరణ్ఆధ్వర్యంలో వట్పల్లి మండల కేంద్రంలో అలయ్బలయ్నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో వడ్లకో నీతి, గోధమలకో నీతా అని అడిగే దమ్ము బీజేపీ ఎంపీలకు ఉందా అని ప్రశ్నించారు. సబ్కా సాత్, సబ్కా వికాస్ కాదు పూరా బక్వాస్అన్నారు. ఏపీలో క్షణాల్లో ప్యాకేజీలు మంజూరు చేస్తున్నారని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే కేంద్రం మెడలు వంచి పనులు చేయించుకోవచ్చన్నారు.
మరోవైపు గ్యారంటీలను చట్టబద్ధత చేస్తామని చెప్పి ఓట్లు దండుకొని కాంగ్రెస్గద్దెనెక్కి తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. అధికారంలోకి రాగానే అవ్వకు రూ.4వేలు పింఛన్అన్నారు. అత్తకిస్తే కోడలుకు ఎగ్గొట్టి, కోడలికిస్తే అత్తకు ఎగ్గొట్టిందన్నారు. రేవంత్రెడ్డి వచ్చాక కొత్త పింఛన్లు దేవుడెరుగు కానీ ఉన్న పింఛన్లలో కోత విధించారన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రేస్సోళ్లు ఓట్లడగటానికి వస్తే పింఛన్లు ఏమయ్యాయని నిలదీయండని పిలుపునిచ్చారు.
కేసీఆర్హయాంలో లేని యూరియా కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందన్నారు. అందోల్ నియోజకవర్గంలో తమ హయాంలో బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం ఎందుకు బంద్పెట్టిందన్నారు. ఈ విషయంపై త్వరలో ప్రజల మద్దతతో పాదయాత్ర చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, సంగారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యేలు ప్రభాకర్, మాణిక్రావు, మాజీ జడ్పీ చైర్పర్సన్మంజుల, తదితరులు పాల్గొన్నారు.