ఆశా వర్కర్ల హామీలు అమలు చేయాలి..లేదంటే ఉద్యమం తప్పదు: హరీశ్ రావు

ఆశా వర్కర్ల హామీలు అమలు చేయాలి..లేదంటే ఉద్యమం తప్పదు: హరీశ్ రావు

ముషీరాబాద్, వెలుగు: ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీల ను అమలు చేసి, వారి సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రి హరీశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ఇచ్చిన హామీ మేరకు 18 వేల జీతం ఇవ్వాలని అడుగుతున్నారని అన్నారు. 

ఆశా వర్కర్ల డిమాండ్ల సాధనకు బీఆర్టీయూ ఆధ్వర్యంలో రాంబాబు యాదవ్ అధ్యక్షతన సోమవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు హరీశ్ రావు హాజరై మాట్లాడారు. ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి తుంగలో తొక్కారన్నారు.  ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి పోయి చేసింది ఏమీ లేదని.. నిరుద్యోగులను మోసం చేసిన సీఎం ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు.