
గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్( Pawan kalyan), హరీశ్ శంకర్(Harish Shankar.S) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఇప్పటికే కొంత పార్ట్ షూట్ పూర్తయింది. హరీశ్ శంకర్ తన సినిమా అప్‌డేట్‌లను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో పాటు అభిమానులకు రిప్లయ్ ఇస్తూ వారికి ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. అయితే, కొన్నిసార్లు ట్వీట్స్ వార్ కూడా జరుగుతూ ఉంటుంది.
రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ క్వాలిటీ విషయంలో ఓ నెటీజన్ చేసిన కామెంట్ కు డైరెక్టర్ హరీష్ శంకర్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరో నెటిజన్ చేసిన పోస్ట్ కు.. డైరెక్టర్ పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే,‘ఉస్తాద్ భగత్ సింగ్’ఆగిపోతుందంటూ ట్విట్టర్ X లో ఒక నెటిజన్ పోస్ట్ చేయగా..వారికి హరీశ్ స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చారు. ‘సినిమా మొదలేకాదు అని రూమర్స్ వచ్చినప్పుడే పట్టించుకోలేదు.ఇప్పుడు ఇలాంటి వాటి గురించి చదివే సమయం కూడా లేదు’ అని అన్నారు. దీంతో హరీశ్ తనదైన శైలిలో చెప్పిన సమాధానంతో పవన్ ఫ్యాన్స్ సూపర్బ్ అంటున్నారు. కాగా.. ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోయిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని డైరెక్టర్ స్పష్టం చేశారు.
సినిమా స్టార్ట్ అవ్వదు అన్నప్పుడే
— Harish Shankar .S (@harish2you) July 5, 2024
రూమర్స్ పట్టించుకోలేదు
ఇప్పుడు రూమర్స్ చదివే టైం కూడా లేదు ….. https://t.co/pVVPCQWa57
ఈ సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాల షూటింగ్ కంప్లీట్ అయినట్లు హరీశ్ శంకర్ గతంలోనే తెలిపారు.ఇందులో పవన్ కల్యాణ్ ఎప్పటిలాగే గబ్బర్ సింగ్ మాదిరి పవర్‌ఫుల్‌గా కనిపిస్తారని హరీష్ వెల్లడించారు.శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అశుతోష్ రానా,నవాబ్ షా, ‘కేజీఎఫ్’ ఫేమ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్,టెంపర్ వంశీ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం..ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు ఓజీ, హరిహర వీరమల్లు, సినిమాల్లో నటిస్తున్నారు.