సిద్ధిపేటలో హరీష్ రావు యోగా

సిద్ధిపేటలో హరీష్ రావు యోగా

మనదేశంలో మొదలైన యోగాను ఇవాళ ప్రపంచంలోని అన్ని దేశాల్లో జరుపుకోవడం మనకు గర్వకారణం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. దేశ ప్రధాని నుంచి అధికారులు, సామాన్య ప్రజలు అందరూ యోగా చేస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో యోగాను ప్రభుత్వ పాఠశాలల్లో ఓ సబ్జెక్ట్ గా చెప్పేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు చేసేవాళ్లకు యోగా అవసరం ఉండదని.. కానీ పట్టణ ప్రాంతాల్లో ప్రజలు తప్పకుండా యోగాసనాలు వేయాలని ఆయన అన్నారు. యోగా ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెప్పారు.

సిద్ధిపేటలో 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు హరీష్ రావు. ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డితో కలిసి జ్యోతి వెలిగించి యోగా సెషన్ ప్రారంభించారు. అభివృద్ధి అనేది 4 రోడ్లు, 4 బిల్డింగ్ లు కట్టడం వల్ల రాదు.. ప్రజలు సంతోషంగా,ఆరోగ్యంగా ఉన్నపుడే అభివృద్ధి జరిగినట్టు అని చెప్పారు హరీష్ రావు.