కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపు చేపట్టారు. 84 రోజులకు సంబంధించిన ఆలయంలోని 13 హుండీలను లెక్కించగా రూ. 1,79,35,866 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. 130 విదేశీ కరెన్సీ నోట్లను భక్తులు హుండీలో వేసినట్టు చెప్పారు.
లెక్కింపులో వచ్చిన మిశ్రమ వెండి,బంగారాన్ని తిరిగి బ్యాగులో వేసి సీల్ చేశామన్నారు. దేవాదాయ శాఖ జగిత్యాల డివిజన్ పర్యవేక్షణకులు రాజమోగిలి, హరిహరనాథ్, ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ, రఘు, ఆలయ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.
