హర్ష సాయి హీరోగా పాన్ ఇండియా మూవీ.. నిర్మాతగా బిగ్ బాస్ బ్యూటీ

హర్ష సాయి హీరోగా పాన్ ఇండియా మూవీ.. నిర్మాతగా బిగ్ బాస్ బ్యూటీ

ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి(Harsha sai) హీరోగా మారిపోయాడు.. అది కూడా పాన్ ఇండియా మూవీలో.. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి హర్ష సాయికి సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది. తాను చేసిన వీడియోలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తన చుట్టూ ఉన్నవాళ్ళల్లో ఎవరైనా కష్టాల్లో ఉంటె భరించలేదు హర్ష సాయి. వారి వివరాలు తెలుసుకుని వారికి తనవంతు సాయం చేస్తుంటాడు. ఇలా చాలా మందికి ఆర్ధిక సహాయం ఆడించాడు హర్ష సాయి. ఈ క్రమంలోనే అతనికి దేశవ్యాప్తంగా చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. ఈ ఫెమ్ తోనే ఇప్పుడు సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు హర్ష సాయి. 

తాజాగా హర్ష సాయి హీరోగా చేస్తున్న సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అతను హీరోగా చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అండ్ టీజర్ లాంచ్ ఈ సెప్టెంబర్ 17న జరగబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఫిల్మ్ నగర్ లోని జెఆర్సీ కన్వెన్షన్ లో ఈ ఈవెంట్ జరగనుంది. ఇక ఈ సినిమాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దగ్గరి బంధువైన కల్వకుంట్ల వంశీధర్ రావు, బిగ్ బాస్ హౌస్ బ్యూటీ మిత్ర శర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.