
పంచకుల: ఈ ఏడాది చివర్లో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జంగ్ సైరన్ ఊదింది. 24 గంటల ఫ్రీ కరెంటు, మహిళలకు ప్రతి నెలా రూ.1000 ఇస్తామంటూ వరాలు ప్రకటించింది.
శని వారం హర్యానాలోని పంచకులలో “కేజ్రీవాల్ కి గ్యారంటీ” పేరుతో నిర్వహించిన ఎన్నికల ప్రచార ప్రారంభ కార్యక్రమంలో ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ భార్య సునీత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఎంపీలు దుర్గేశ్ పాఠక్, హర్యానా ఆప్ చీఫ్ సుశీల్ గుప్తా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సునిత మాట్లాడుతూ.. హర్యానాలో ఆప్ అధికారంలోకి వస్తే 24 గంటల ఫ్రీ కరెంటు, మహిళలకు ప్రతి నెలా రూ.1000, ఉచిత విద్య, ఉచిత వైద్యం(మొహల్లా క్లినిక్స్‌లో), యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. హర్యానా మాణిక్యమైన కేజ్రీవాల్‌ను ప్రధాని మోదీ అన్యాయంగా జైలులో పెట్టారని ఆమె అన్నారు.