ఉగ్రవాదులను వారి ఇళ్ల దగ్గరే చంపుతున్నాం

ఉగ్రవాదులను వారి ఇళ్ల దగ్గరే చంపుతున్నాం

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో బాంబు దాడులు ఆగిపోయాయన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. హర్యానాలోని రేవారీలో ఎన్నికల ప్రచారం చేశారు మోడీ. ఉగ్రవాదులను వారి ఇళ్ల దగ్గరే చంపుతున్నామని చెప్పారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నవారే ప్రపంచం ముందు ఏడుస్తున్నారని పాకిస్తాన్ పై సెటైర్లేశారు. తాము అధికారంలోకి రాగానే… భద్రతా బలగాలను బలోపేతం చేయడం ప్రారంభించామని చెప్పారు. తేజాస్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మోడీ ఆరోపించారు.