శంషాబాద్: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు బండారు దత్తాత్రేయ శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు కాన్వాయ్లో బయల్దేరారు. కాన్వాయ్లో వెళుతుండగా ఉన్నట్టుండి ఓ వ్యక్తి రోడ్డుపై అడ్డువచ్చాడు.
సడన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్లోని మూడు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బండారు దత్తాత్రేయకు తృటిలో ప్రమాదం తప్పింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రధాన దారిలో ఈ ఘటన జరిగింది. స్పాట్కు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ | సీనియర్ ఐఏఎస్ ప్రశాంతికి పోస్టింగ్ ఇచ్చిన ఏపీ సర్కార్