మైడెన్ ఫార్మాకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నోటీసులు

మైడెన్ ఫార్మాకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నోటీసులు

మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌పై హర్యానా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మైడెన్ సంస్థ ఉత్పత్తి చేసిన దగ్గు మందు తాగి గాంబియాలో దాదాపు 66మంది చిన్నారులు మృతి చెందారని ఇటీవలె ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ క్రమంలో చట్టపరమైన ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలని హరియాణా డ్రగ్ కంట్రోల్ బోర్డ్ ఆదేశించింది. సొనెపెట్లోని మైడెన్కు చెందిన దగ్గు మందు తయారీ కేంద్రంలో లోపాలు ఉన్నట్లు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గుర్తించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.  

కంపెనీ లైసెన్స్ ను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. నవంబర్ 14లోపు నోటీసులకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దగ్గు మందు తయారీ, టెస్టింగ్ కు సంబంధించిన పరికరాల లాగ్బుక్లు నిర్వహించండంలో విఫలమైందని పేర్కొంది. ప్రొఫైలిన్ గ్లైకాల్, సార్బిటాల్ సొల్యూషన్, సోడియం మిథైల్ పరాబెన్ బ్యాచ్ నెంబర్లు లేవని గుర్తించింది. అయితే ఈ మందులు నాణ్యతా ప్రమాణాలకు తగ్గట్టుగా లేవని గతంలోనే నాలుగు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేయగా..2011లో వియత్నాం కూడా ఈ సంస్థపై నిషేధం విధించింది.