Rishab Pant: పంత్ ని కాపాడిన వారికి రూ.5000 బహుమతి

Rishab Pant: పంత్ ని కాపాడిన వారికి రూ.5000 బహుమతి

ఉత్తరాఖండ్, రూర్కీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో బయటపడ్డ రిషబ్ పంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. కారు రెయిలింగ్ ని ఢీ కొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో నుంచి బయటికి దూకేసిన పంత్ ని అటుగా వెళుతున్న హర్యానా రోడ్వేస్ బస్ డ్రైవర్ సుశీల్ కుమార్ చూశాడు. బస్సుని పక్కకు ఆపి పంత్ పై ఒక దుప్పటి కప్పి కారు దగ్గరనుంచి దూరంగా తీసుకెళ్లాడు. తర్వాత అంబులెన్స్ కి ఫోన్ చేసి గోల్డెడ్ అవర్ హాస్పిటల్ లో చేర్పించాడు. అయితే, సుశీల్ కుమార్ చేసిన పనికి సోషల్ మీడియాలో అందరూ రియల్ హీరో అని కొనియాడుతున్నారు. సుశీల్ పంత్ ని కాపాడిన సందర్భం గురించి వివరిస్తూ.. తను క్రికెట్ ని చూడనని, పంత్ ఎవరో తనకు తెలియదని చెప్పాడు. ప్రమాదంలో ఉన్న వ్యక్తిని కేవలం మానవత్వంతో కాపాడానని వెల్లడించారు.

ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన కావాల్సిన సాయం అందించిన సుశీల కుమార్, ఆ బస్సు కండక్టర్ పరంజీత్ ని గుడ్ సమరిటన్ స్కీమ్ కింద సత్కరించారు. ఈ ఇద్దరికి రూ.5వేలు బహుమతిగా అందించారు. అంతేకాకుండా ఉత్తరాఖండ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ఇద్దరిని సత్కరించనున్నాయి. 

అయితే, ప్రమాదం జరిగినప్పుడు పంత్ దగ్గర కొంత డబ్బు ఉందని, వాటిని గుర్తు తెలియని వ్యక్తులు కార్ లోనుంచి దొంగిలించారనే వార్తలు వచ్చాయి. అయితే, అవన్నీ అవాస్తవాలే అని తేలింది. పంత్ దగ్గర కేవలం రూ. 7000 ఉన్నాయని, వాటిని బస్సు డ్రైవర్ సూశీల్ తీసుకొచ్చి పంత్ కి అందజేశాడు.