పోలీస్ అధికారిని గంట జైల్లో పెట్టిన కోర్టు : తలకెక్కిన మదాన్ని దించిన న్యాయస్థానం..

పోలీస్ అధికారిని గంట జైల్లో పెట్టిన కోర్టు : తలకెక్కిన మదాన్ని దించిన న్యాయస్థానం..

కోర్టులో నేరస్థులకు, నిందితులకు శిక్షలు వేస్తుండటం చూసుంటారు.. కానీ సాక్షం చెప్పేందుకు మాయమవుతున్న ఓ పోలీస్ అధికారికి కోర్ట్ ఊహించని షాక్ ఇచ్చింది. దింతో అక్కడ ఉన్న కోర్ట్ సిబ్బంది సహా సామాన్యులు కూడా అవాక్కయ్యారు. 2021లో జరిగిన ఒక హత్య కేసు విచారణలో  గురువారం కైతాల్ ప్రత్యేక కోర్టులో ఒక ఊహించని సంఘటన జరిగింది. హర్యానా రాష్ట్రం vs గౌరవ్ అనే కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్‌ కోర్టుకు పదే పదే గైర్హాజరు కావడంతో అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి మోహిత్ అగర్వాల్  అతనిని ఒక గంట పాటు కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది.  

కోర్టు ఆదేశాల ప్రకారం ఉదయం 10:30 నుండి 11:30 వరకు ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్‌ను కోర్టులో ఖైదీల కోసం ఏర్పాటు చేసిన గదిలో పోలీస్ యూనిఫాంలోనే ఉంచారు. ఈ  ఘటన తర్వాత కోర్టు చర్యలపై పోలీసు శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది, స్థానికులు కూడా విమర్శలు చేస్తున్నారు. 

ప్రస్తుతం సిర్సా జిల్లాలోని బడాబుధ పోలీస్ స్టేషన్‌లో SHOగా పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్, సాక్ష్యం చెప్పడానికి చాలా సార్లు కోర్టుకు హాజరు కాలేదని ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల ఆగస్టు 29న కోర్టు ఆయనపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గురువారం ఆయన సాక్ష్యం చెప్పడానికి వచ్చినప్పుడు, కోర్టు ఆయనను ఒక గంటసేపు కోర్టు ప్రదేశంలో బారికేడ్లలో ఉంచాలని ఆదేశించింది.

ALSO READ : మహిళా పారిశ్రామికవేత్తలకు ధైర్యం ఎక్కువ.. 

కోర్టు నుండి ఉత్తర్వులు లేవు: ఖైదీ ఎస్కార్ట్ ఇన్‌చార్జ్ సబ్ ఇన్‌స్పెక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ, నయీబ్ కోర్టు దీపక్, కోర్టు రీడర్, పీపీలు ఇన్‌స్పెక్టర్‌ రాజేష్ కుమార్ని  జైలులో ఉంచాలని కోరారు. అయితే, ఇందుకు లిఖితపూర్వక ఉత్తర్వులు అడిగినప్పుడు, ఎవరి దగ్గర ఉత్తర్వులు లేవు. దాదాపు ఒక గంట తర్వాత కోర్టు నుండి లిఖితపూర్వక ఆదేశాలు రాగానే ఇన్‌స్పెక్టర్‌ను కోర్టులో హాజరుపరచడానికి తీసుకెళ్లారు.

కోర్టు కోపం సమర్ధించిన, కానీ చర్య తీసుకున్న విధానం చాలా కఠినంగా, అవమానకరంగా ఉందని జిల్లా పోలీసు సిబ్బంది అంటున్నారు. ఒక SHO స్థాయి అధికారి అయిన అతన్ని యూనిఫాంలో జైల్లో నిందితుడిగా ఉంచడం కరెక్ట్ కాదని  అభిప్రాయపడుతున్నారు.