బెంగాల్ వారియర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై..హర్యానా స్టీలర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలుపు

బెంగాల్ వారియర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై..హర్యానా స్టీలర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలుపు

పట్నా‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పదో సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తొమ్మిదో విజయం సాధించిన హర్యానా స్టీలర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాలుగో స్థానానికి చేరుకుంది. శివం పతారే (12 పాయింట్లు),  సిద్దార్ధ్ దేశాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (11 పాయింట్లు) సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో విజృంభించడంతో సోమవారం జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హర్యానా 41–36తో బెంగాల్ వారియర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించింది. గాయాన్ని సైతం లెక్కచేయకుండా కెప్టెన్, స్టార్ రైడర్ మణీందర్ సింగ్ 13 పాయింట్లతో సత్తా చాటినా బెంగాల్ టీమ్‌ను గెలిపించలేకపోయాడు.

ఈ విజయంతో హర్యానా స్టీలర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్ల పట్టికలో  ఆరు నుంచి నాలుగో స్థానానికి చేరుకుంది. మరో మ్యాచ్‌‌లో పట్నా పైరేట్స్‌‌ఈ 32–20తో గుజరాత్‌‌ జెయింట్స్‌‌ను చిత్తు చేసింది.  కాగా,  మంగళవారం జరిగే  మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  పుణెరి పల్టన్‌తో తెలుగు టైటాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోటీ పడనుంది.