
అనుష్క, నవీన్ పొలిశెట్టి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. పి.మహేష్ కుమార్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాంగ్‌తో ఇంప్రెస్ చేసిన టీమ్, బుధవారం మరో పాటను విడుదల చేసింది. హీరో ధనుష్ దీన్ని పాడడం విశేషం.
నిరాశతో నవీన్ అరిచే వాయిస్‌తో పాట మొదలవుతుంది. తన భవిష్యత్తు తెలుసుకోవాలని ఒక చిలక దగ్గరకు వెళితే అది కూడా పారిపోతుంది. అలా తన లైఫ్‌లో చేయాలనుకున్నది జరగకపోవడం అనే కాన్సెప్ట్‌తో ఈ పాట సాగింది. ‘హతవిధి.. ఏందిదీ.. ఊహలో లేనిది.. బుల్లి చీమ బతుకుపై... బుల్డోజరైనది’ అంటూ ధనుష్ పాడిన తీరు ఆకట్టుకుంది. రధన్ కంపోజ్ చేసిన పాటకు రామజోగయ్య శాస్త్రి క్యాచీ లిరిక్స్ రాశారు. ఇదొక పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్ అని, త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు.