ముగ్గురూ ముగ్గురే

ముగ్గురూ ముగ్గురే

సంగారెడ్డి : ఉమ్మ డి మెదక్‌ జిల్లా హ్యాట్రిక్‍ ఎంపీలుగా గడ్డం వెంకటస్వామి, మొగలిగుంట్ల బాగారెడ్డి, నంది ఎల్లయ్య చరిత్ర సృష్టించారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని లోక్‍సభ నియోజకవర్గంలో ఈ ముగ్గురు రాజకీయ ఉద్దండులకు తిరుగులేకుండా పోయింది. వరుసగా మూడు సార్లు సిద్దిపేట ఎంపీలుగా జి.వెంకట్‍స్వామి, నంది ఎల్లయ్య, మెదక్‌ ఎంపీగా ఎం.బాగారెడ్డి గెలుపొందారు. 1967లో గడ్డం వెంకటస్వామి సిద్దిపేట లోక్‍సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచా రు. అలాగే 1971లో  తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థిగా రెండో సారి గెలిచి ముచ్చటగా మూడోసారి 1977లో కాంగ్రెస్‌ నుంచి

గెలిచి విజయకేతనం ఎగురవేశారు. 1979లో లోక్‍సభ సభ్యత్వానికి వెంకటస్వామి రాజీనామా చేసి మంత్రి వర్గంలో చేరారు. దీంతో సిద్దిపేటలో లోక్‍సభకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా  నంది ఎల్లయ్య బరిలో నిలిచి గెలుపొందారు. ఆ తర్వాత మళ్లీ 1989, 1991, 1996 సంవత్సరంలో వరుసగా సిద్దిపేట లోక్‍సభ ఎన్నికల్లో మూడు సార్లు నంది ఎల్లయ్య విజయం సాధించా రు. అలాగే మెదక్ ఎంపీగా కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు బాగా రెడ్డి 1989, 1991 , 1996 , 1998 లలో జరిగిన లోక్‍సభ ఎన్నికల్లో వరుసగా నాలుగు సార్లు గెలిచారు. అంతకుముందు 1957 నుంచి 1989 వరకు బాగారెడ్డి ఏడు సార్లు జహీరాబాద్‌ శాసనసభ నియోజకవర్గం నుంచి గెలవడం బాగారెడ్డికి నాలుగు సార్లు ఎంపీగా గెలిచే అవకాశం కలిగింది. అయితే 2009లో నియోజకవర్గా ల పునర్విభజనతో సిద్దిపేట లోక్‍సభ స్థానం కనుమరుగైంది. సిద్దిపేటకు బదులు జహీరాబాద్‌ లోక్‍సభను సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ ని మూడు మండలాలను కలుపుతూ నియోజకవర్గం గా ఏర్పాటు చేశారు. దీంతో మెదక్ లోక్‍సభ పరిధిలు మారి ఉమ్మడి మెదక్ లో మెదక్‍, జహీరాబాద్‍ లోక్‍సభ స్థానాలు కొనసాగుతున్నాయి .