కరోనా సోకిందని భార్యకు చెప్పి.. ప్రియురాలితో ఎంజాయ్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు

కరోనా సోకిందని భార్యకు చెప్పి.. ప్రియురాలితో ఎంజాయ్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు

ప్రియురాలితో గడపాలన్న భర్త ఎత్తుల్ని చిత్తు చేసింది ఓ భార్య. కరోనా సోకిందంటూ భార్యను నమ్మించి చివరకు కటకటాల పాలయ్యాడు.

నేవీ ముంబైకి చెందిన ఓయువకుడికి పెళ్లైంది. కానీ పెళ్లికి ముందే ఓయువతి పరిచయం అయ్యింది. ఆ పరిచయం పెళ్లి తరువాత కూడా కొనసాగింది.

ఒకానొక సమయంలో భర్తకు తన ప్రియురాలితో గడపాలనే దుర్బుద్ది పుట్టింది. కానీ ఏం చేస్తాం. అసలే కరోనా. భార్య కు మాయమాటలు చెప్పి ఆఫీస్ టూర్ అని చెప్పి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో ఏం చేయాలి. అని ఆలోచిస్తుండగా భర్త ఓ ప్లాన్ వేశాడు.

అంతే క్షణ ఆలస్యం చేయకుండా ముందే అనుకున్న ప్లాన్ ప్రకారం జులై 24న తన భార్యకు ఫోన్ చేశాడు. నా కరోనా సోకింది. నేను ఇంక జీవించలేను అంటూ మొరపెట్టుకున్నాడు. దీంతో సదరు భార్య భర్తను బుజ్జగించే ప్రయత్నం చేసింది.

తన భర్తకు కరోనా సోకిందని కంగారు పడింది ఆ మహా ఇల్లాలు. భర్తకు కరోనా సోకింది. ఎక్కడున్నాడో ఏమో. ఏం చేస్తున్నాడో తిన్నాడో లేదో ఇలా ఆలోచనలతో గందరగోళానికి గురైంది. భర్త జాడ కోసం తన సోదరుడిసాయం తీసుకుంది. సోదరుడి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ దర్యాప్తులో భాగంగా గాలింపు చర్యలు చేపట్టారు. వాషి సెక్టార్ 17 హైవే సమీపంలో భర్త బైక్, హెల్మెంట్, వ్యాలెట్ ఇవన్నీ లభ్యం అయ్యాయి కానీ పూర్తి సమాచారం అందలేదు. దీంతో కేసును ఛాలెంజ్ గా తీసుకున్న ఏసీపీ వినాయక్ వాట్స్ బాధితుడి ఇంటి సమీపంలో, బైక్ దొరికిన ప్రాంతంలో సీసీటీవీ పుటేజీ చెక్ చేశారు.

తప్పిపోయిన రోజు బాధితుడు 100కి రెండు సార్లు ఫోన్ చేసినట్లు గుర్తించిన ఏసీపీ..అతనికి శత్రువులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు చేశారు. నెల రోజుల దర్యాప్తు తరువాత బాధితుడికి వివాహేతర సంబంధం ఉందని, ప్రస్తుతం అతను ఇండర్ లో ఉన్నట్లు గుర్తించారు.

దర్యాప్తులో దొరికిన వివరాల ఆధారంగా ముంబై నుంచి ఓ పోలీస్ బృందం ఇండర్ కు వెళ్లింది. ఇండోర్ లో భర్త తన ప్రియురాలి తో కలిసి ఉండగా నిందితుణ్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.