హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ : నగరంలో వర్షం కురుస్తుంది. సోమవారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండోతో వేడెక్కిన వాతావరణం చల్లబడింది. పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడుతున్నాయి. బంజారాహిల్స్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, బోరబండ, మియాపూర్, ఎస్ఆర్ నగర్, లింగపల్లి, చందానగర్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిస్తుంది.

పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఉదయం నుండి ఎండ వేడి.. ఉక్కపోతతో అల్లాడుతున్న జనాలు వర్షంతో రిలాక్స్ అయ్యారు. సమ్మర్ సీజన్ లో వర్షం రావడంతో ఎంజాయ్ చేస్తున్నారు సిటీజనం.