ఎండ దెబ్బకు చల్లటి ఐస్ క్రీం తింటుంటే.. సగంలో బల్లి తోక వచ్చింది..!

ఎండ దెబ్బకు చల్లటి ఐస్ క్రీం తింటుంటే.. సగంలో బల్లి తోక వచ్చింది..!

నాలుగు రోజుల క్రితం గుజరాత్ లో ఐస్ క్రీంలో బల్లి తోక ప్రత్యక్షమైన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.. మండే ఎండల నుంచి ఉపశమనం కోసం మహిళ ఐస్ క్రీం కొని తింటుండగా అందులో బల్లి తోక ప్రత్యక్షమయింది..  అప్పటికే సగం ఐస్ క్రీం తినడం వల్ల మహిళ వాంతులతో అనారోగ్యం పాలయ్యింది. బాధిత మహిళను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఈ ఘటన ఐస్ క్రీం లవర్స్ కి నిద్ర లేకుండా చేసింది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.. 

ALSO READ | ట్రంప్ ఇండియాపై కక్షగట్టాడా..? మామిడి పండ్లు రిజెక్ట్, రైతులకు రూ.4 కోట్లు నష్టం

ఇదిలా ఉండగా  హవ్మోర్ ఐస్ క్రీం కంపెనీకి రూ. 50 వేలు జరిమానా విధించింది స్థానిక కోర్టు. ఐస్ క్రీం అమ్మిన షాపును సీజ్ చేశారు మున్సిపల్ అధికారులు. ఐస్ క్రీం అమ్మిన షాపుకు లైసెన్స్ కూడా లేదని తెలిపారు అధికారులు. ఈ ఘటనపై స్పందించిన హవ్మోర్  "మేము చేసే ప్రతి పనిలోనూ ఉత్పత్తి నాణ్యత మరియు వినియోగదారుల నమ్మకం ప్రధానమైనవి. విషయం యొక్క తీవ్రతను అర్థం చేసుకుని, మా బృందం వెంటనే కస్టమర్‌ను సంప్రదించి దర్యాప్తు చేసింది." అని పేర్కొంది.

 

కస్టమర్‌తో కనెక్ట్ అవ్వడానికి మేము చాలాసార్లు ప్రయత్నించామని..  దర్యాప్తు చేయడానికి వీలుగా ఆ ఐస్ క్రీం కోన్‌ను అందించమని బాధిత మహిళను కోరామని తెలిపింది హవ్మోర్. మహిళ ఇంకా ఐస్ క్రీం కోన్ తమకు అందించలేదని, ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని.. ఇది ప్యాకింగ్ లో సమస్య వల్ల జరిగిందా.. లేక డిస్ట్రిబ్యూషన్ లో సమస్య వల్ల జరిగిందా అనే కోణం దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది హవ్మోర్ కంపెనీ.