ట్రంప్ ఇండియాపై కక్షగట్టాడా..? మామిడి పండ్లు రిజెక్ట్, రైతులకు రూ.4 కోట్లు నష్టం

ట్రంప్ ఇండియాపై కక్షగట్టాడా..? మామిడి పండ్లు రిజెక్ట్, రైతులకు రూ.4 కోట్లు నష్టం

Mango Shipment: ఇటీవలి కాలంలో ట్రంప్ చేస్తున్న ప్రకటనలను భారత్ వరుసగా ఖండిస్తూ వస్తోంది. పెద్దన్న పాత్ర పోషిస్తున్న ట్రంప్ ఇండియాపై కూడా తన ఆధిపత్యం కోసం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. మెుదట ఆపరేషన్ సిందూర్ తానే ఆపానన్న ట్రంప్ తర్వాత వెనక్కి తగ్గారు. ఆ తర్వాత భారత్ అమెరికాతో సున్నా సుంకాలతో వ్యాపారానికి అంగీకరించిందంటూ తొందరపాటు ప్రకటనతో మళ్లీ అబాసుపాలయ్యాడు. అయితే ఆ కోసం భారతీయ వ్యాపారులపై ప్రస్తుతం చూపిస్తున్నారా అనే అనుమానాలు పరిస్థితులను చూస్తే కలుగుతోంది.

ALSO READ | రెమిటెన్స్‌‌‌‌పై యూఎస్‌‌‌‌ ట్యాక్స్ వేస్తే ఇండియాకు నష్టమే : జీటీఆర్‌‌‌‌‌‌‌‌ఐ

వివరాల్లోకి వెళితే అమెరికా అధికారులు దాదాపు 15 కంటైనర్ల భారత మామిడి పళ్లను రిజెక్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలోని లాస్ ఏంజెలెస్, సాన్ ఫ్రాన్సిస్కో, అట్లాంటా సహా మరిన్ని విమానాశ్రయాల్లో సరైన డాక్యుమెంట్లు లేవనే కారణాన్ని చూపుతూ పండ్లు నిరాకరణకు గురయ్యాయి. దీంతో ఎగుమతిదారులు వాటిని వెనక్కి తీసుకెళతారా లేక అమెరికాలోనే వాటిని నాశనం చేయాలా అనే సమస్య తలెత్తింది. మామిడి పళ్ల పాడయ్యే స్వభావంతో పాటు తిరిగి వెనక్కి తెచ్చే ఖర్చులను పరిగణించి చాలా మంది వాటిని అమెరికాలోనే డిస్పోజ్ చేయాలని ఎంచుకున్నారు. 

అమెరికా అధికారులు తాజా చర్యలతో ఎగుమతిదారులకు దాదాపు రూ.4 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తేలింది. వాస్తవానికి అమెరికాకు పంపించే మామిడి పండ్లకు ముందుగా యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ గుర్తింపు పొందిన ఫెసిలిటీలో ఇరేడియేషన్ ప్రక్రియ నిర్వహిస్తారు. దీని ద్వారా సూక్ష్మజీవులను తొలగించటంతో పాటు పండ్ల నాణ్యతను మెరుగుపరచి, ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు వీలు కల్పించబడతాయి. అయితే వీటిని యూఎస్ అధికారి ఇస్తుంటారు. కానీ వీటి జారీలో తప్పిదాలు జరిగాయంటూ అమెరికా ఎయిర్ పోర్టుల్లో పండ్లు రిజెక్ట్ చేయబడ్డాయి. ముంబై చుట్టుపక్క ప్రాంతాల నుంచి ఎగుమతైన పండ్లు ప్రస్తుతం తిరస్కరణకు గురయ్యాయని తేలింది.

వీటిపై ఎగుమతిదారులను ప్రశ్నించగా.. తాము అమెరికా గుర్తింపు పొందిన కేంద్రానికి పంపామని, వారి అధికారులు ఇచ్చిన ధృవీకరణను వారే అంగీకరించటం లేదని పేర్కొన్నాడు. అమెరికా అధికారి నుంచి క్లియరెన్స్ రాకుండా ముంబై ఎయిర్ పోర్టులో వాటిని లోడింగ్ కూడా చేయరని, ఇదంతా చూస్తుంటే కావాలనే తిరస్కరించినట్లు కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఉన్నతాధికారులు సైతం దీనిపై కామెంట్ చేసేందుకు ముందుకు రాకపోవటంతో ఎగుమతిదారులు అయోమయంలో ఉన్నారు. ప్రస్తుతం అమెరికా చర్యలతో తమకు కోట్లలో నష్టం వచ్చిందని వారు వాపోతున్నారు.