
- మనకు వచ్చే డాలర్లు తగ్గుతాయి, రూపాయి విలువ పడుతుంది: జీటీఆర్‌ఐ
న్యూఢిల్లీ: అమెరికాలో నాన్-–సిటిజన్స్ విదేశాలకు పంపే డబ్బుల (రెమిటెన్స్)పై 5 శాతం టాక్స్ వేయాలని ట్రంప్ ప్రభుత్వం చూస్తోంది. దీని ప్రభావం ఇండియన్స్, రూపాయి విలువపై ఎక్కువగా ఉంటుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌ఐ) అంచనా వేస్తోంది. ఈ ప్రతిపాదనను యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ఈ నెల 12న ప్రవేశ పెట్టారు. ఇది నాన్ -యూఎస్ సిటిజన్స్, అంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్, హెచ్1బీ,హెచ్2ఏ వీసాల్లో ఉన్న టెంపరరీ వర్కర్స్ చేసే ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్‌ఫర్స్‌ను టార్గెట్ చేస్తుంది. కానీ యూఎస్ సిటిజన్స్ పంపే డబ్బులపై ఈ టాక్స్ పడదు. ఈ టాక్స్ ప్రపోజల్ అమల్లోకి వస్తే ఇండియాకు వచ్చే బిలియన్ డాలర్ల ఫారిన్ కరెన్సీ తగ్గిపోతుందని అని జీటీఆర్‌ఐ తెలిపింది. 2023–-24లో వివిధ దేశాల నుంచి 120 బిలియన్ డాలర్ల రెమిటెన్స్‌ను ఇండియా అందుకుంది.
ఇందులో దాదాపు 28 శాతం, అంటే సుమారు 32 బిలియన్ డాలర్లు యూఎస్ నుంచి వచ్చాయి. “5 శాతం టాక్స్ వల్ల ఇంటికి డబ్బు పంపడానికి అయ్యే ఖర్చు ఎక్కువవుతుంది. ఒకవేళ రెమిటెన్స్ 10–-15 శాతం తగ్గితే, ఇండియాకు ఏటా 12-–18 బిలియన్ డాలర్ల ఫారిన్ కరెన్సీ ఇన్‌ఫ్లోస్ తగ్గుతాయి” అని జీటీఆర్‌ఐ ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ్ చెప్పారు. ఈ లాస్ వల్ల ఇండియా రూపాయి విలువ డాలర్ మారకంలో పడిపోతుంది. కేరళ, ఉత్తర ప్రదేశ్, బిహార్ లాంటి రాష్ట్రాల్లో లక్షల కుటుంబాలు ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్, హౌసింగ్ లాంటి బేసిక్ ఖర్చుల కోసం రెమిటెన్స్‌పై ఆధారపడుతున్నాయి.