క్యాంపస్ ప్రశాంతంగా ఉంది: HCU రిజిస్ట్రార్

క్యాంపస్  ప్రశాంతంగా ఉంది: HCU రిజిస్ట్రార్

డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ విద్యార్థి సంఘాలకు కౌన్సెలింగ్ నిర్వహించామని హెచ్ సీయూ రిజిస్ట్రార్  డాక్టర్ దేవేష్ నిగమ్ చెప్పారు.  ఒక హాస్టల్ లో   ఓ  బృందం  డాక్యుమెంటరీ రిలీజ్ చేసినట్లు తమకు తెలిసిందన్నారు. వచ్చే వారం నుండి జరిగే సెమిస్టర్ ఎగ్జామ్స్ దృష్ట్యా  డాక్యుమెంటరీలు రిలీజ్ చేయొద్దని కోరారు. శాంతి భద్రతల సమస్య, క్యాంపస్‌లో  ప్రశాంతతను కాపాడుకోవాలని సూచించారు.హెచ్ సీయూలో ప్రస్తుతం ప్రశాంతంగా ఉందన్నారు

అంతకుముందు ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీని  ఎస్ఎఫ్ఐ  మరోసారి టెలికాస్ట్ చేయడంతో ఏబీవీపీ ధర్నాకు దిగింది. హెచ్ సీయూలో వీడియో స్క్రీనింగ్ ను ఆపాలంటూ మెయిన్ గేట్ వద్ద బైఠాయించింది. బీబీసీ డాక్యుమెంటరీకి  ప్రదర్శనకు నిరసనగా ఏబీవీపీ నార్త్ బ్లాక్ లో కాశ్మీరీ ఫైల్స్ మూవీని ప్రదర్శించింది. ఈ రెండు గ్రూప్ ల హోరాహోరీ నినాదాలతో క్యాంపస్ లో ఉద్రిక్తత నెలకొంది. దీంతో  అలర్ట్ అయిన పోలీసులు అక్కడికి  భారీగా చేరుకున్నారు.