
ప్రభుత్వోద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 2 వ తేది వరకు ఉన్న బ్యాన్ ను తొలగించేందకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 3 నుంచి బదిలీలపై తిరిగి నిషేధం అమల్లోకి వస్తుంది. ఒకే చోట ఐదేళ్లు పనిచేసే వారిని తప్పనిసరిగా బదిలీ చేస్తామని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పియూష్కుమార్ తెలిపారు. . మే 31 నాటికి ఒక స్టేషన్లో ఐదేళ్లు నిరంతరాయంగా పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలి. ట్రాన్సఫర్ల విషయంలో ఆరోగ్య సమస్యలున్న వారిని అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటారు.
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు లేదా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వచ్చే ఏడాది (2026) మే 31వ తేదీలోగా పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు ట్రాన్సఫర్ నుంచి మినహాయింపు ఇచ్చారు. దృష్టి లోపం కలిగిన (అంధులైన) ఉద్యోగులు కోరుకుంటే, వారి బదిలీలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మానసిక వికాస సమస్యలున్న పిల్లల తల్లిదండ్రులైన ఉద్యోగులకు, భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వోద్యోగులైతే, వారిద్దరినీ ఒకే స్టేషన్లో లేదా దగ్గరగా ఉన్న స్టేషన్లలో పనిచేసేలా వారి విజ్ఞప్తి మేరకు బదిలీల్లో ప్రాధాన్యత కల్పిస్తారు.